జల్లికట్టు విషయంలో కమల్‌హాసన్ ఉత్సాహం
తమిళ సినీ పరిశ్రమ అంతా ఒక్కటై జల్లికట్టుకి మద్దతు పలికిన విషయం తెలిసిందే. సినీ నటుడు, దర్శకుడు, కొరియోగ్రాఫర్ లారెన్స్ వ్యక్తిగతంగా జల్లికట్టు ఉద్యమంలో పాల్గొన్నాడు. ఆందోళనకారులకు ఆహారం అందించేందుకుగాను చాలా పెద్దమొత్తంలోనే ఖర్చు చేశాడు.
హీరోయిన్ త్రిష మొదట్లో జల్లికట్టుని వ్యతిరేకించినా, జల్లికట్టు ఆందోళనకారుల నుంచి తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొన్న తర్వాత మనసు మార్చుకుంది. మరోపక్క, తమిళ సినీ పరిశ్రమ అంతా జల్లికట్టుకి మద్దతిస్తోందంటూ ఓ నిరసన కార్యక్రమాన్ని కూడా నడిగర్ సంఘం నిర్వహించేసింది.
జల్లికట్టు ఆందోళనలకు సంబంధించి, సినీ నటుడు కమల్‌హాసన్ మొదటి నుంచీ ఆసక్తికరమైన వ్యాఖ్యలే చేస్తున్నాడు.. ఒక్కోసారి ఆయన చాలా ఎక్కువ ఇంటరెస్ట్ చూపిస్తున్నాడేమో అనిపిస్తోంది . జల్లికట్టుకి మద్దతునిస్తూనే, ఆ క్రెడిట్ ఎవరు పొందాలి.? అన్న విషయమై కమల్ చేస్తున్న వ్యాఖ్యలు అందర్నీ ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి . తమిళ సినీ పరిశ్రమ 'క్రెడిట్ కోసం' కక్కుర్తి పడొద్దని కమల్ చేసిన వ్యాఖ్యలు పెద్ద సంచలనాలే సృష్టిస్తున్నాయి . అదేవిధంగా తాజాగా కమల్‌హాసన్, జల్లికట్టు ఆందోళనకారులు విధ్వంసాలకు స్పందించాడు. ఇక్కడ, పోలీసుల పద్ధతినే తప్పు పట్టాడు. ఇంకా , తన వ్యాఖ్యలకు కారణాలు చూపుతూ ఓ వీడియో కూడా విడుదల చేశాడు. ఆ వీడియోలో కొందరు పోలీసులు, వాహనాలకు నిప్పుపెడ్తున్న దృశ్యాలున్నాయి.
ఆయన చేసిన వ్యాఖ్యలు, పోస్ట్ చేసిన వీడియో కలకలం రేపుతున్నాయి. జల్లికట్టుకి మద్దతిచ్చేసి ఊరుకోవడం కాకుండా .. దాన్ని ఫాలోఅప్ చేసేస్తున్నాడు . దాంతో కమల్ నుంచి తమకు ఇంతలా లభిస్తున్న మద్దతుకి, జల్లికట్టు ఆందోళనకారులు చాలా మురిసిపోతున్నారు. తమిళ సినీ పరిశ్రమలో కమల్, లారెన్స్.. ఈ ఇద్దరే ఇప్పుడు జల్లికట్టుకి సంబంధించి 'తమిళ సూపర్ స్టార్స్'.. అన్నది ఆందోళనకారుల అభిప్రాయం .
కమల్ పద్దతి చూస్తోంటే.. పొలిటికల్‌గా ఆయన ఆలోచనలు సాగుతున్నాయా.? అన్న అనుమానం కలుగుతోంది. తమిళ రాజకీయాల్లో సినీ గ్లామర్ ప్రభావం చాలా ఎక్కువగాఉంది . జయలలిత మరణం తర్వాత నాయకత్వ లేమి తమిళనాడులో స్పష్టంగా కనబడుతోంది . రజనీకాంత్ ఎలాగు రాజకీయాల్లోకి వచ్చే దైర్యం చేయడంలేదు. కమల్, ఆ ఛాన్స్ తీసుకుంటాడా.? ఆయనలో ఇప్పుడీ జల్లికట్టు ఉత్సాహానికి కారణం రాజకీయ ఆలోచనలేనా.? ఏమో కమల్‌హాసన్‌కే తెలియాలి.వేచిచూడాలి
జల్లికట్టు విషయంలో కమల్‌హాసన్ ఉత్సాహం
Reviewed by Unknown
on
12:02 AM
Rating:

No comments: