BREAKING NEWS

Film Fun Zone

Sruthi's New Film With Kamal


ఇప్పటి వరకు శ్రుతిహాసన్  దగ్గర  దగ్గర పాతిక  సినిమాలు చేసారు . ఇవన్ని ఒక ఎత్తైతే ఇప్పుడు చేస్తున్న ' శబాష్ నాయుడు  ' మరో ఎత్తు అనేంతగా  ఆమె ఆనందపడిపోతున్నారు . దానికి  కారణం  తొలి సారి తండ్రి కమలహాసన్ తో కలిసి  ఆమె నటిస్తున్న చిత్రం ఇది  .  దశావతారం  లో ఓ పాత్ర  అయిన  బలరాం  నాయుడు  పాత్ర తో ఈ సినిమా రూపొందుతోంది . ఇందులో కమలహాసన్ భార్య పాత్రను రమ్యకృష్ణ  చేయనున్నారు . ఈ సినిమా లో కమల్ , శ్రుతి  తమ నిజ జీవిత పాత్రలు ఫోషి స్తున్నారు . అంటే   తండ్రి కూతుర్లుగా నటిస్తున్నారు .  ఈ చిత్రం  తెలుగు , తమిళ్ , హిందీ భాషాల్లో ఈ సినిమా రూపొందుతోంది. 

ఈ సినిమా బారీ షెడ్యూల్  నీ  US  లో ప్లాన్ చేసారు . ఈ షూటింగ్ లో  పాల్గొనడానికి  శ్రుతి  US  కి వెళ్ళారు . " మా నాన్న  గారితో  యాక్ట్  చేయబోతున్నoదుకు  చాలా ఆనందంగా , ఎగ్జయిటింగ్ గా ఉంది "  అని శ్రుతి అన్నారు . ఈ బ్యూటీ   ఎగ్జైట్  అవుతున్న విదానం  చూస్తుంటే "సుప్రీం " ' సినిమాలో జింగ్ ...... జింగ్ ..... అమెజీంగ్'  అనే  డైలాగ్  ని  మార్చి  'టింగ్ ..... టింగ్ ..... ఎగ్జయిటింగ్ '  అనాలేమో.  


Sruthi's New Film With Kamal Sruthi's New Film With Kamal Reviewed by Unknown on 8:58 PM Rating: 5

No comments:

Sora Templates