సరైనోడు సినిమాకి కేరళలో బారీ ఓపెనింగ్స్
'సరైనోడు' సినిమా తెలుగులో భారీ ఓపెనింగ్స్ ను తీసుకొచ్చింది . కేరళలో ఈ సినిమా ను కూడా అప్పుడే రిలీజ్ చేద్దామని అనుకున్నారు. కొన్ని కారణాల వలన ఆలస్యమైంది. ఈ సినిమాను నిన్ననే 'యోధావు' పేరుతో కేరళలో 80 థియేటర్స్ లో విడుదల చేశారు. అల్లు అర్జున్ కి మలయాళంలో ఎంతో క్రేజ్ వుంది అందుకే , భారీ ఓపెనింగ్స్ ను రాబట్టింది. ప్రీమియర్ షోలను కూడా వేసినట్టు తెలుస్తోంది.
.. అల్లు అర్జున్ లుక్ .. ఆయన స్టైల్,బోయపాటి యాక్షన్ మార్క్ కేరళ ఆడియన్స్ కి బాగా నచ్చేశాయని అంటున్నారు. నిన్న కేరళలోని 'తిరువనంతపురం'లో ఈ సినిమాను అభిమానులతో కలిసి అల్లు శిరీష్ చూశాడట. అక్కడ ఈ సినిమాకి ఆయన చాలా హ్యాపీగా ఫీలయ్యాడని చెబుతున్నారు ఈ సినిమాకి వచ్చిన రెస్పాన్స్ ని చూసి . అల్లు అర్జున్ ముందు చిత్రాలమాదిరిగానే అక్కడ ఈ సినిమా భారీ వసూళ్లను సాధించడం ఖచ్చితం అనే అభిప్రాయాలు తెలుస్తున్నాయి .
సరైనోడు సినిమాకి కేరళలో బారీ ఓపెనింగ్స్
Reviewed by Unknown
on
11:58 PM
Rating:

No comments: