అమీర్ అంటే ద్యేషం --సల్మాన్ ఖాన్
50 ఏళ్ళు అంటే ఆ వయసులో బాడీ మేకోవర్ అంటే మాములు విషయం కాదు, దానికి ఎంతో కృషి,తపన ,పట్టుదల ఉంటె గాని సాధ్యంకాదు. అయితే బాలీవుడ్ హీరోస్ అమీర్ ఖాన్ ,కండలవీరుడు సల్మాన్ ఖాన్ యాబై ఏళ్ల లోనూ బాడీ మేకోవర్ చేసి అందర్నీ అబ్బా అనిపించారు.
సల్మాన్ 'సుల్తాన్ 'విడుదలై ఘనవిజయం సాధించి మాంచి వసూళ్లు రాబట్టి బాక్సాఫీస్ బద్దలు కొట్టారు. 'సల్మాన్ సూపర్ 'అని అందరిలోనూ అనిపించుకున్నారు. ఇప్పుడు రిలీజ్ అయిన అమీర్ ఖాన్ చిత్రం 'దంగల్' కూడా సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. అమీర్ మేకోవర్ కి ప్రజల ప్రశంసలు లభిస్తున్నాయి.
నా ఫ్యామిలీ తో కలిసి 'దంగల్' సినిమా చూశా ,సుల్తాన్ కంటే ఇదే బాగుందని సల్మాన్ అభినందించారు. అమీర్ వ్యక్తిగతంగా నువ్వంటే ఇష్టం ,వృత్తిపరంగా మాత్రం ద్యేషం అని సరదాగా చమత్కరించారు. సల్మాన్ చేసిన ఫన్నీ ట్విట్ కి అంతే ఫన్నీగా అమీర్ కూడ ట్విట్ చేశారు.
అమీర్ అంటే ద్యేషం --సల్మాన్ ఖాన్
Reviewed by Unknown
on
10:34 PM
Rating:

No comments: