పబ్లిసిటీ తో సినిమా హిట్ కాదు. ....... నయనతార
సినిమా ప్రమోషన్ కార్యక్రమాలకు హాజరుకాని హీరోయిన్లకు ప్రెమెంట్లో కటింగ్ విధించాలి, అని ఫేమస్" తమిళ నటుడు వివేక్ "ఓ ఫంక్షన్లో అన్నారు. " పైకి పేరు చెప్పాకున్నా ఆయన నయనతారనే విమర్శించారని అందరికి అర్థమైంది.
వివేక్ వ్యాఖ్యలను నయనతార దగ్గర ప్రస్తావించగా --"ఆయన నా గురించే అన్నారని తెలుసు . ఓ చెత్త సినిమా గురించి ఎంత పబ్లిసిటీ చేసినా దానిలో సత్తా లేకపోతే అది ప్లాప్ . సినిమాలో సత్తా ఉంటె ప్రేక్షకులు వారంతటవారే సినిమాను హిట్ చేస్తారు. ఎంత పబ్లిసిటీ ఉంటె అంత హిట్ అవుతుందనుకోవడము భ్రమ . సినిమాలను పబ్లిసిటీ కాపాడడము నేనెప్పుడూ చూడలేదు అన్నారు. మలయాళం కుట్టి నయనతార. నయనతార మీడియా ముందుకి రావడమే అరుదు. సినిమాకు సంతకము చేసే ముందుగానే పబ్లిసిటీ కార్యక్రమాలకు రానని కచ్చితంగా చెప్పేస్తారు. ఇది అందరికి తెలిసిన విషయమే. సడన్ గా ఇంత పెద్ద లెక్చర్ ఎందుకిచ్చిదంటే నటుడు వివేక్ పబ్లిసిటీ విషయంలో హీరోయిన్ల పారితోషికంలో కటింగ్ గురించి మాట్లాడినందుకు.
నిర్మాతలు పేమెంట్ పూర్తిగా ఇవ్వకపోయినా పట్టించుకోను, నిర్మాతల పరిస్థితినిబట్టి కొన్ని సినిమాలకి నేనే తగ్గిచుకున్నా . పబ్లిసిటీ కార్యక్రమాలకు రావాలా? వద్దా? అనేది హీరోయిన్ల ఇష్టం. నిర్మాతలకు ఏ సమస్యా లేనప్పుడు, మిగతావాళ్లందరికి ఎందుకంత బాధ నాకు అర్థంకాదు. నా దగ్గరకు వచ్చిన దర్శక, నిర్మాతలకు నేను ముందుగానే పబ్లిసిటీ కార్యక్రమాలకు హాజరుకానని స్పష్టంగా చెబుతానని నయనతార అన్నారు.
పబ్లిసిటీ తో సినిమా హిట్ కాదు. ....... నయనతార
Reviewed by Unknown
on
10:06 PM
Rating:
Reviewed by Unknown
on
10:06 PM
Rating:

No comments: