BREAKING NEWS

Film Fun Zone

కమలహాసన్ - అందుకే రజనీకాంత్' కి విలన్ గా నటించలేదు .





దర్శకుడు  శంకర్  'రోబో సీక్వెల్ 2 . 0'  లో  రజనీకాంత్  హీరో , కమలహాసన్  విలన్  అని   స్క్రిప్ట్  రాసుకునేటప్పుడు  ఈ  విదంగానే  అనుకున్నారు . కమల్ ,రజనీ  వీళ్ళిద్దరి  కాంబినేషన్  అయితే  ఈ  సీక్వెల్  కి బారీ  అంచనాలు,  భారీతనం  వస్తుందని ,నిర్మాణం  వ్యయం  ఎక్కువైనా  పర్వాలేదని  శంకర్  అనుకున్నారు .

 బాలచందర్  దర్శకత్వం లో రజనీ , కమల్  కలసి  చేసిన  తరువాత  చాలా  సినిమాల్లో  కలసి నటించారు . స్టార్ డం వచ్చిన  తరువాత   మాత్రం  కలసి  నటించకూడదని  దీనికి  ఒక  ఒప్పందం  చేసుకున్నామని  కమలహాసన్  చెప్పారు . అందుకనే  ఈ  సినిమాకి  కమల్  నో  చెప్పారు,ఈ  సినిమాలో  హీరోగా  నటించటానికి  రజనీ ఎస్  చెప్పారు . ఆ  తరువాత  ఈ  సినిమాలో  విలన్ గా  అక్షయకుమార్  ని  శంకర్  ఎంపికచేసుకున్నారు .

"2.0" లో  విలన్  రోల్  కాబట్టి  కాదనలేను  కానీ  నేను   నో  చెప్పటానికి  ఇంకొక  కారణం ఉంది  నేను రజనీ  కలిస్తే  మా   మార్కెట్ కి   తగ్గ  పారితోషకం  ఇవ్వాలి . మాకే  అంత  ఇస్తే  ఇక  సినిమా  నిర్మించడానికి  డబ్బులు  ఎక్కడవుంటాయ్. అందుకని  నో  చెప్పానని  అసలు  కారణం  బయట  పెట్టారు  కమల్.

ఫ్యాన్స్  మా  కాంబినేషన్  కోరుకుంటే  పూర్తి  సినిమానే  చేయనవసరం  లేదని  అతిధి  పాత్రలైనా  చేయొచ్చని  అందుకు  తాను  రెడీ  అని  కమల్  అన్నారు . ఇద్దరం  కలసి  నటిస్తే   పారితోషకం  తగ్గించుకోవాల్సివస్తుందని   అలా  ఏందుకు  చేయాలని  కమల్  అన్నారు . నిజమే  కదా .... !

  

    
కమలహాసన్ - అందుకే రజనీకాంత్' కి విలన్ గా నటించలేదు . కమలహాసన్ - అందుకే  రజనీకాంత్'  కి   విలన్ గా నటించలేదు .   Reviewed by Unknown on 8:24 PM Rating: 5

No comments:

Sora Templates